Janasena leader Murthy Yadav: ఏపీ సీఎస్ పై జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన కామెంట్స్

టీవల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి రహస్యంగా విశాఖ వెళ్లిరావడం పలు అనుమానాలకు తావిచ్చింది .ఇదే క్రమంలో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ జవహర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు . సీఎస్ సీక్రెట్ విశాఖ పర్యటనలు పూర్తి స్థాయిలో భూకబ్జాల కోసమేనని మూర్తి యాదవ్ ఆరోపించారు

  • Written By:
  • Publish Date - May 27, 2024 / 07:48 PM IST

Janasena leader Murthy Yadav: ఇటీవల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి రహస్యంగా విశాఖ వెళ్లిరావడం పలు అనుమానాలకు తావిచ్చింది .ఇదే క్రమంలో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ జవహర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు . సీఎస్ సీక్రెట్ విశాఖ పర్యటనలు పూర్తి స్థాయిలో భూకబ్జాల కోసమేనని మూర్తి యాదవ్ ఆరోపించారు .జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు బోగాపురం వద్ద చేస్తున్న భూదందాల గురించి ఖచ్చితంగా చెబుతున్నారు మూర్తి యాదవ్. మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలతో చీఫ్ సెక్రటరీ జవహర్ రడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.తన విశాఖ పర్యటనల గురించి తప్పుడు సమాచారం ఇవ్వ డం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని జహార్ రెడ్డి మూర్తి యాదవ్ ను బెదిరించారు. అయినప్పటికీ మూర్తి యాదవ్ బెదరలేదు.

విశాఖలో వైసీపీ భూదందాలు..(Janasena leader Murthy Yadav)

గతంలో కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై కూడా మూర్తి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు .విశాఖ పట్టణంలో భూముల పై వైసీపీ నేతల కన్ను పడిందని ,భూదందాలకు పాల్పడుతున్నారని కొన్ని ఆధారాలతో సహా అప్పట్లో బయట పెట్టారు .తాజాగా డైరెక్ట్ గా సీఎస్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు దమ్ముంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సవాల్ చేస్తున్నారు. సీఎస్ సీక్రెట్ విశాఖ పర్యటనలు పూర్తి స్థాయిలో భూకబ్జాల కోసమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ కూడా సమర్థిస్తోంది. విశాఖ, బోగాపురం దగ్గర భూదందాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి.ఎన్ని అసైన్డ్ ల్యాండ్స్ చేతులు మారుతున్నాయో లెక్కలు బయటకు రావడం లేదని అంటున్నారు . కానీ వైసీపీలోని అగ్రనేతలకు సంబంధించిన వారు మాత్రం గత రెండు, మూడు నెలలుగా ఇంత కాలం తాము కబ్జాలు చేసిన వాటిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అక్కడి అధికారులు కలెక్టర్ సహా అందరూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జవహర్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో విషయం బయటకు వచ్చింది.