Site icon Prime9

Nagababu: జనసేన నేత నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా?

Janasena leader Nagababu assets values: జనసేన నేత నాగబాబు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంతకుముందు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు ఏ పదవి వస్తుందనే విషయంపై జోరుగా చర్చ జరిగింది. కానీ చివరికి ఆయనను మండలికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు రూ.55.37కోట్లు, బ్యాంకులో నిల్వ రూ.23.53 లక్షలు, చేతిలో నగదు రూ.21.81లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08 కోట్లు బెంజ్ కారుతో పాటు 950 గ్రాముల బంగారం, 55 క్యారెట్ల వజ్రాలు, 20 కేజీల వెండి ఉంది. మొత్తం రూ.59 కోట్ల చరాస్తులు, రూ.11 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఇది కాకుండా తన సోదరుడు చిరంజీవి దగ్గరు నుంచి రూ.28లక్షలు, పవన్ కల్యాణ్ నుంచి రూ.6లక్షలు అప్పుగా తీసుకున్నారు.

Exit mobile version
Skip to toolbar