Janasena Flexi: సీఎం జగన్ ఫ్లెక్సీ పక్కన మేము సిద్దమే అంటూ జనసేన ఫ్లెక్సీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమరశంఖాన్ని పూరించింది. ఇందులో భాగంగా శనివారం భీమిలి నియోజక వర్గం సంగివలస సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. సీఎం జగన్ ఈ సభకు హాజరై క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. రాబోయే ఎన్నికల యుద్దంలో ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా తాను సిద్దంగా ఉన్నానంటూ చెప్పారు. నేను సిద్దం మీరు సిద్దమా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 04:02 PM IST

Janasena Flexi: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమరశంఖాన్ని పూరించింది. ఇందులో భాగంగా శనివారం భీమిలి నియోజక వర్గం సంగివలస సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. సీఎం జగన్ ఈ సభకు హాజరై క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. రాబోయే ఎన్నికల యుద్దంలో ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా తాను సిద్దంగా ఉన్నానంటూ చెప్పారు. నేను సిద్దం మీరు సిద్దమా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.

జనసేన కౌంటర్..(Janasena Flexi)

ఇలా ఉండగా రెండు రోజుల తరువాత నేడు విజయవాడలో తాజాగా జనసేన వైఎస్సార్ సీపీకి కౌంటర్ ఇచ్చింది. జగన్ ఫొటోతో సిద్ధమే అనే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పక్కనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోతో మేము సిద్ధమే అనే పేరుతో జనసేన కార్యకర్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పవన్ ఫ్లెక్సీని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. మొత్తం మీద సీఎం జగన్ కు కౌంటర్ గా జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవడంతో ఏపీలో ఎన్నికల సందడి మొదలయింది.ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో 151 మంది సభ్యులున్న వైఎస్సార్‌సీపీ మూడు స్దానాలను గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే తాజాగా జరిగిన పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన భారీ కసరత్తు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరిని ఇతర నియోజకవర్గాలకు తరలించే ప్రయోగం ఆ పార్టీలో తీవ్ర అసమ్మతికి దారితీసింది. వీరిలో కొందరు అధికార పార్టీని వీడి టీడీపీ లేదా జనసేన లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ స‌ద్వినియోగం చేసుకుని అభ్య‌ర్ధిని నిల‌బెట్టాల‌ని భావిస్తోంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, ఇది ఒక సీటును గెలుచుకోవడానికి సహాయపడుతుందని భావిస్తోంది.వైఎస్సార్‌సీపీలోని అసమ్మతి ఎమ్మెల్యేలందరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారని అందువలన ఒక్క సీటు దక్కవచ్చని టీడీపీ అభిప్రాయపడుతోంది. వైసీపికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.