Janasena chief Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 10:07 PM IST

Janasena chief Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర రైతాంగానికి దర్ోహం చేసాడు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ దళిత యువకులను విదేశీ విద్యకు దూరం చేసాడు. ఎస్సీ సబ్ ప్లాన్ పక్కకు పడేసాడు. వారికి సంబంధించిన 23 పధకాలన్నింటనీ ఆపేసాడు. అంబేద్కర్ పేరు ను మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ కన్నా గొప్పవాడివా జగన్ రెడ్డీ? రేప్ కు గురయిన ఆడపిల్లలను ఇంట్లో పెంపకం అనే మాట్లాడే మంత్రులను చూసామంటూ పవన్ కళ్యాణ్ విరుచుకు పడ్డారు.

వారాహి అంటే భయం..(Janasena chief Pawan Kalyan)

వేలకోట్లు ఉన్నవారికి వారాహిని చూస్తే భయం. ఎందుకంటే మన గుండెల్లో తెగింపు ఉంది.అన్యాయం చేస్తే తిరగబడే శక్తి ఉంది. అందరినీ కలుపుకుని వెళ్లే ప్రేమ ఉంది.వేలకోట్లు ఉన్నవారికి వారాహిని చూస్తే భయం. ఎందుకంటే మన గుండెల్లో తెగింపు ఉంది.అన్యాయం చేస్తే తిరగబడే శక్తి ఉంది. అందరినీ కలుపుకుని వెళ్లే ప్రేమ ఉంది. జనసేన వస్తుందంటే రైతలు ఎక్కౌంట్లో డబ్బులు పడతాయి. గుంతలు పడిన రోడ్లు బాగు అవుతాయి. అయితే అన్ని చోట్లకు నేను వెళ్లలేను కాని మీ పోరాటానికి నేను అండగా ఉంటాను. రాజమండ్రి, కోనసీమ,పిఠాపురంలో పార్టీ ఆఫీసులు పెడతాము. ఉభయగోదావరి జిల్లాలు పచ్చదనంతో కళకళలాడే వరకు పవన్ కళ్యాణ్ ఈ గోదావరి జిల్లాను అంటిపెట్టుకునే ఉంటాడని పవన్ స్పష్టం చేసారు.

కోనసీమకు రైతుకు అండగా ఉంటాను..

పంటకాలువలో సిల్ట్ తీయకపోవడంతో చివరి భూములకు నీరందడం లేదు. అన్నీ అనుకూలించినా రైతుకు ఎకరానికి పదివేల నష్టం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పక్షాన కోనసీమ రైతాంగం నిలబడండి. రైతుభరోసా కేంద్రాలకు నిజమైన భరోసా ఇస్తాము. ప్రతీ బస్తాకు 100 రూపాయల కమీషన్ అడుగుతున్నారు. ఇంత అడ్డగోలు దోపిడీతో రైతు ఏడుస్తున్నాడు. కౌలు రైతుచనిపోతున్నాడు. దళారీలు మాత్రం బాగుపడుతున్నారు. నేను రైతు కష్టం తెలిసిన వాడిని. ఒక్క కొబ్బరికాయకు 7 నుంచి 8 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. జనసేన అధికారంలోకి వస్తే దీనికి సంబంధించిన పరిశ్రమలు, అధికారులు ఇక్కడే ఉంటారు. తెల్లదోమ కారణంగా కొబ్బరి రైతులకు నష్టం వాటిల్లుతోంది. కోనసీమ కొబ్బరి యంత్రాంగానికి గిట్టుబాటు ధర లభించేలా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రాధమిక ఆరోగ్య రంగం నాశనమయిపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రులను చంపేస్తున్నారు. ఆక్వా కాలుష్యం కారణంగా స్త్రీలకు యూరినరీ ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయని యాంటీ బయాటిక్స్ పనిచేయడం లేదని తెలుస్తోంది. భూగర్బ జలాలు పాడయిపోతున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న వ్యక్తి ఇపుడు ఆరోగ్యం కోల్పోయేంత బ్రాండ్లు పెట్టాడు. మద్యం మీద డబ్బులు అక్కర్లేదన్న వ్యక్తి దీనిపై 25 వేల కోట్లు సంపాదించాడు. కిడ్నీ, లివర్ వ్యాధులు ఈ మద్యపానం వల్ల వస్తున్నాయి. మీరు వైసీపీ మత్తులో నుంచి బయటకు రండి. జగన్ బాబూ చాలామంది పసుపుకుంకుమలతో ఆటాడుకుంటున్నావు. వారి కుటుంబాలకు అన్యాయం జరిగితే మీరే బాధ్యత వహించాలి. కాకినాడ గంజాయికి గేట్ వే అయిపోయింది. అన్ని కులాల్లో యువత గంజాయి మత్తులో పడిపోయారు. దివ్యాంగలను కూడా బెదిరిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.

మీరు ఆలోచించి ఓటేసి ఉంటే..

2019 లో మీరు ఆలోచించి ఓటేసి ఉంటే రెండు లక్షల ముప్పైవేల ఉద్యోగాలు రావలసి ఉండేవి. ఇందులో యాభైవేలు టీచర్ ఉద్యోగాలు. ఆరువేల ఐదువందలు పోలీసు ఉద్యోగాలు. మీకు ఉద్యోగాలు ఇస్తామన్న వ్యక్తి ఇవ్వకపోతే మీకు కోపం రావాలి కదా? మరలా నవ్వుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వస్తే వైసీపీ నేతలను అడగాలి. సీపీఎస్ ను వారంరోజుల్లో రద్దు చేస్తామన్న వ్యక్తి ఇపుడు జీపీఎస్ అంటున్నాడు. జగన్ బాబుకు తెలియలేదు అని ఆయన సలహాదారు చెబుతున్నాడు. నోటికి వచ్చినదల్లా చేసేస్తానని చెప్పేసాడు. పదమూడు లక్షల మంది ఉద్యోగులకు సీపీఎస్ రావాలి. సీపీఎస్ వచ్చే వరకు పోరాటం చేస్తాము. ప్రభత్వ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నాను. మీ కన్నీరు తుడవడానికి నాకు శక్తిని ఇవ్వాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

కోనసీమ ప్రేమలో వాడి, వేడి ఉంటుంది. నా ఓటమిని తట్టుకోవడానికి మీరు ఒక కవచంలా పనిచేసారు. మహానుభావుడు అంబేద్కర్ పేరు పెడతానంటే అందరూ సంతోషించేవారం. కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ పేరు. కడపలో అన్నమయ్య పేరు పెట్టినపుడు గొడవ రాలేదు. ఇక్కడ మాత్రం మీరు కావాలనే పార్టీనుంచి అభిప్రాయ సేకరణ పేరుతో గొడవలు సృష్టించారు. 250 మంది యువకులపై కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సీఎం ను వేడుకుంటున్నాను. అందరి మధ్య గొడవలు పెడతాడు. వారి సొంత చిన్నాయన కూతురు సునీత గారు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ నేతలచేత ఆంధ్రా నా కొడకుల్లారా అని తిట్టించుకున్నాము. ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు. మనకు ఆంధ్రా భావన లేకపోతే మట్టి కొట్టుకు పోతామని వవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభివృద్ది జరగాలంటే, జనం బాగోవాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలన్నారు.  హలో ఏపీ బైబై వైసీపీ అంటూ పవన్ పిలుపు నిచ్చారు.