IPS Transfers: తెలంగాణలో ఐపిఎస్‌ల బదిలీలు మొదలయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబుని నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సైబరాబాద్ కమిషనర్‌గా అవినాష్ మహంతిని నియమించారు. ఇప్పటిదాకా హైదరాబాద్ సిపిగా ఉన్న సందీప్ శాండిల్యని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరక్టర్‌గా నియమించారు. రాచకొండ సిపి దేవేంద్ర సింగ్ చౌహాన్‌ని, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రని డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
రెండు నెలల కిందట..(IPS Transfers)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రెండు నెలల కిందట ఎన్నికల సంఘం 20 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎటువంటివిధులు అప్పగించవద్దని సీఎస్‌ను ఆదేశించింది. బదిలీ అయిన వారిలో హైదరాబాద్, వరంగల్, నిజమాబాద్ సీపీలతో పాటు పలు జిల్లాల ఎస్పీలు ఉన్నారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తరువాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించింది. ఇపుడు మూడు కమీషనరేట్ల పరిధిలో కొత్త అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.