Site icon Prime9

Indian Student Missing: అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

Indian Student

Indian Student

Indian Student Missing:హైదరాబాద్‌ విద్యార్థి మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి అమెరికాలోని షికాగో వెళ్లాడు. వారం రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీనితో 25 ఏళ్ల రూపేష్‌ చంద్ర చింతకంది కోసం షికాగో పోలీసులు, ఇండియన్‌ కౌన్సేలేట్‌ కార్యాలయం సిబ్బంది కూడా ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి అతని ఆచూకీ తెలియకుండా పోయిందని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. కాగా రూపేష్‌ కాంకోర్డియా విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్లో మాస్టర్‌ చేయడానికి వెళ్లాడు. అయితే ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు తరచూ తప్పిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత నెలలో ఒహియోలో మహ్మద్‌ అబ్దుల్‌ అర్పాత్‌ ఒక నెల పాటు కనిపించకుండా పోయిన తర్వాత శవమై తేలాడు. అంతకు ముందు వారం రోజుల క్రితం ఉమా సత్య సాయి గద్దె అనే మరో భారతీయ విద్యార్థి ఒహియోలో కనిపించకుండా పోయి తర్వాత శవమై తేలాడు.

రూమ్‌మేట్స్‌తో మాట్లాడిన తల్లిదండ్రులు..(Indian Student Missing)

రూపేష్‌ ఆచూకీ తెలుసుకోవడానికి హైదరాబాద్‌లో ఉన్న కుటుంబసభ్యులు అతని రూమ్‌మేట్స్‌తో మాట్లాడారు. వారు చెప్పేది ఏమిటంటే టెక్సాస్‌ నుంచి ఎవరూ కలవడానికి వచ్చారు. అతన్నికలిసేందుకు రూపేశ్‌ వెళ్లాడని చెబుతున్నారు. కాగా రూపేశ్‌ చివరగా తన తండ్రితో ఈ నెల 2న మాట్లాడాడు. రూపేశ్‌ టెక్సాస్‌ నుంచి వచ్చిన కలవడానికి వెళ్లాడు. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. రూపేశ్‌ ఏదో పనిచేసుకుంటున్నాడు. ఈ నెల 2 నుంచి అందుబాటులో లేకుండా పోయాడని తండ్రి వాపోయాడు. రూపేశ్‌ తండ్రి సదానందం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖకు లేఖ రాసి అమెరికాలోని తన కుమారుడి ఆచూకీ కొనుగొనడానికి తనకు సాయం చేయాల్సింది కోరారు.

కాగా షికాగోపోలీసులు కూడా రూపేశ్‌ ఆచూకీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇండియన్‌ కమ్యూనిటితో మాట్లాడి ఆచూకీ కొనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా షికాగో ఉన్న ఇండియన్‌ కౌన్సులేట్‌ రూపేశ్‌ ఆచూకీ కొనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని ఎక్స్‌లోపోస్ట్‌ చేసింది. త్వరలోనే ఆయన ఆచూకీ కనుగొంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version