Site icon Prime9

Vanaparthi : వనపర్తిలో తల్లి, కూతురు సహా వాగులో ముగ్గురు గల్లంతు

vanaparthi

vanaparthi

Vanaparthi: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో పొంగిపొర్లుతున్న ఊకచెట్టు కాజ్‌వేను దాటేందుకు ప్రయత్నించిన తల్లీ కూతురు సహా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు.ముగ్గురిని సంతోషమ్మ (35), ఆమె కుమార్తె పరిమళ (18), సంతోషమ్మ అక్క కుమారుడు సాయి కుమార్ (25)గా గుర్తించారు. ముగ్గురు కొత్తకోట నుంచి దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

సంతోషమ్మ, పరిమళ తన అక్కతో కలిసి దసరా జరుపుకోవడానికి కొత్తకోటకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సాయి కుమార్ వారిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. బ్రిడ్జి పొంగిపొర్లుతున్నప్పటికీ దాన్ని దాటాలని సాయికుమార్ నిర్ణయించుకున్నాడు. ముగ్గురూ బ్రిడ్జి మధ్యలోకి చేరుకోగా, పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరు మహిళలు,బైక్‌తో పాటు కాల్వలో పడిపోయాడు సాయికుమార్. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చీకటి పడడంతో విరమించారు. ఆదివారం ఉదయం నుంచి తిరిగి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Exit mobile version