CM Jagan: అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్దీకరణ చేయాలని కేబినేట్ నిర్ణయించింది.
సీపీఎస్ స్థానంలో జీపీఎస్..(CM Jagan)
ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకు వచ్చింది.సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అమ్మఒడి పథకం అమలుకు, విద్యాకానుక పంపిణీ, గ్రూప్-1,2 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం తెలిపింది.
ముందస్తు ఎన్నికలు లేవు..
అనంతరం సీఎం జగన్ ముందస్తు ఎన్నికలపై మంత్రులకు స్పష్టతనిచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని జగన్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ఎన్నికలకి ఇంకా 9 నెలలే సమయం ఉందని, కష్టపడితే మళ్ళీ అధికారం మనదేనని సిఎం జగన్ మంత్రులతో అన్నట్లు తెలిసింది.