MLA Rajaiah comments: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య పరోక్షంగా స్పందించారు. గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య కార్యకర్తలకి విజ్ఞప్తి చేశారు. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అంటున్నారు కదా.? నేను ఛాలెంజ్ చేస్తున్నా .. కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రాజయ్య అన్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటానని రాజయ్య ప్రకటించారు. సర్పంచ్ నవ్యపై పరువు నష్టం కేసు వేస్తానని, సైబర్ నేరం కింద జైలుకు పంపిస్తానని రాజయ్య హెచ్చరించారు.
కడియం శ్రీహరిని సస్పెండ్ చేయాలి..(MLA Rajaiah comments)
మరోవైపు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజయ్య పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య ఆరోపించారు. పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం శ్రీవారి వెంట ఉన్నారని, నియోజకవర్గ ప్రజలు తనవెంట ఉన్నారని రాజయ్య చెప్పారు.