Site icon Prime9

Ayyannapatrudu : విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ దొరకాలని స్వామివారిని కోరుకున్నాను.. అయ్యన్నపాత్రుడు

Ayyanna

Ayyanna

Ayyannapatrudu: రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తుని కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో  ఆయన  శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల టిడిపి నేత అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని రెండే రెండు కోరికలు కోరుకోవడం జరిగిందన్నారు .ఒకటి ఈ రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి పిల్లలకి భవిష్యత్తు ఉండేలా చూడమని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే రెండవ కోరిక వైసిపి నేత విజయసాయిరెడ్డి మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. ఆ మొబైల్ దొరకాలని మొబైల్ దొరికితే ఆయన చేసిన అక్రమాలు ఢిల్లీ మద్యం కుంభకోణం విశాఖ భూములు ఆక్రమణలు గురించి పూర్తి ఆధారాలు అందులో ఉన్నాయని ఆ మొబైల్ దొరకాలని స్వామివారిని కోరుకున్నట్లు అయ్యన్న చెప్పారు.

Exit mobile version