MP Margani Bharat Ram:నేను తలచుకుంటే 10 సినిమాల్లో హీరోగా నటించి వాటిని సూపర్ హిట్స్ చేయగలను అంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏకచిత్ర నటుడు అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తాను అనుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకని 10 సినిమాల్లో హీరోగా నటించగలనని అన్నారు. తనకు గ్లామర్ ఉందని నటించిన సినిమాలన్నింటినీ సూపర్ హిట్స్ చేయగలనని అన్నారు. కావాలంటే నీకు కూడ పాత్ర ఇస్తాను. నువ్వు గోచి కడతావు కదా అంటూ ఎంపీ రఘురామను ఉద్దేశించి అన్నారు. ఎంపీ రఘురామరాజును కామెడీ యాక్టర్ గా పరిగణించవచ్చు. అన్నారు. నువ్వు కామెడీ స్టార్ కు ఎక్కువ.. ఎందుకూ పనికిమాలిన స్టార్ కు తక్కువ. పార్లమెంట్ లోమ తెలుగురాని ఎంపీలు కూడా నీ అరిటాకు స్టోరీ .. అది చిరిగిపోయిన నటన చూసి నవ్వుతుంటారు. ముందు ఈ విషయం తెలుసుకో అన్నారు. తనకు అన్ని రంగాల్లో మంచి అనుభవం ఉందంటూ భరత్ రామ్ చెప్పుకున్నారు. ఏకచిత్ర నటడేంట్రా సూపర్ స్టార్ గా చేయగలను అంటూ వ్యాఖ్యనించారు.
రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్దగా నిధులు కేటాయించలేదని భరత్ రామ్ అన్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టును చూస్తే. కేటాయింపు ఎంత? 2019-20 నాటికి అంచనా రూ.55,000 కోట్లకు చేరుకుంది. ఇది మాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. కానీ ఈ బడ్జెట్‌లో కేవలం రూ.475 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ను బర్త్ డే కేక్ లాగా విభజించింది. ఇది అశాస్త్రీయంగా జరిగింది. పర్యవసానంగా రాజధాని హైదరాబాద్ కొత్త రాష్ట్రానికి దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 68 ఏళ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బును హైదరాబాద్‌గా మార్చేందుకు వెచ్చించారని ఆయన అన్నారు.అయితే రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఉల్లాసమైన భావన ఉండాలి. అందుకే మన ముఖ్యమంత్రి మూడు రాజధానుల గురించి మాట్లాడారు. వైజాగ్ (విశాఖపట్నం) ఒక శక్తివంతమైన నగరం. మనం దానిని ప్రపంచానికి చాటిచెప్పాలి. మేము ప్రజలకు అవగాహన కల్పించాలి, తద్వారా వారు కొత్త రాజధాని గురించి ఆనందాన్ని అనుభవిస్తారని ఎంపీ భరత్ రామ్ అన్నారు.