Site icon Prime9

CM Jagan on Manifesto: మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది నేనే .. సీఎం జగన్

CM Jagan on Manifesto

CM Jagan on Manifesto

CM Jagan on Manifesto: సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో ను చూసి ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే… పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే నంటూ జగన్ అన్నారు . ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు జగన్ . పొరపాటును చంద్రబాబుకి ఓటేయడం అంటే.. కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని తెలిపారు .

రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము.. (CM Jagan on Manifesto)

మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు 130 సార్లు బటన్‌ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఈ విధంగా బటన్‌లు నొక్కడం, నేరుగా ఖాతాల్లోకి వెళ్లడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు .గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు. కేవలం 59 నెలల పాలనలోనే రెండు లక్షల ఉద్యోగాలిచ్చాం. గత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదని సగర్వంగా చెబుతున్నా. ఇందులో లక్షా 35 వేల మంది మన కళ్లముందు సచివాలయాల్లో కనిపిస్తున్నారని చెప్పారు .

ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. కనీసం వెతికినా దొరికేది కాదు. ఆ సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా జరగని విధంగా.. ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్కు పెట్టండి అని పంపిన చరిత్ర మీ జగన్‌ ది అని పేర్కొన్నారు . మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే అని అన్నారు .

నువ్వు చేసింది ఏం లేదు | Jagan Counter To Chandrababu | Prime9 News

Exit mobile version
Skip to toolbar