TTD Chairman Bhumana Karunakara Reddy: నేను విమర్శలకు భయపడేవాడిని కాను.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

తాను విమర్శలకు భయపడేవాడిని కాదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో ఆయన తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 12:40 PM IST

TTD Chairman Bhumana Karunakara Reddy: తాను విమర్శలకు భయపడేవాడిని కాదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో ఆయన తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు.

17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని నేను. దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను.తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనే . నేను నాస్తికుడిననే విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం అని కరుణాకర రెడ్డి అన్నారు.
అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది నేనే .నా మీద క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని అన్నారు.

పోరాటాలతో పైకి వచ్చాను..(TTD Chairman Bhumana Karunakara Reddy)

తాను పోరాటాల నుండి పైకి వచ్చిన వాడిని అని ఇలాంటి వాటికి భయపడను అని కరుణాకర రెడ్డి అన్నారు.తిరుమల శ్రీవారి పై ఉన్న భక్తి విశ్వాశాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి , భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో మహతిలో పిపిటి ప్రదర్శన ఏర్పాటు చేస్తాము. టీటీడీ మీద విమర్శలు చేస్తున్న వారిలో తిరుపతి వాసులు కూడా ఉన్నారు. టీటీడీని తిరుపతి వాసులు తమ సొంతంగా భావించాలి. దేవుడి దయ వల్లే తిరుపతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు శ్రీవారి వల్లే తిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతోందని కరుణాకర రెడ్డి అన్నారు.