Hyderabad Student Missing: ఇటీవల కాలంలో అమెరికాలో ఇండియన్స్ స్టూడెంట్స్ మిస్సింగ్ కేసులు విపరీంగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్లి నితీషా కందులా మే 28 నుంచి కనిపించకుండా పోయారు. కాగా ఆమె కాలిఫోర్నియా యూనివర్శిటీ సాన్ బెర్నారిడో స్టూడెంట్. ఆమె ఆచూకీకి సహకరించవలసింది పోలీసులు కూడా కోరారు. కాగా పోలీసులు కూడా గత నెల 28 నుంచి ఆమె కనిపించకుండాపోయారని ధ్రువీకరించారు.
గత నెల 30న లాస్ ఏంజిల్స్ లో.. ( Hyderabad Student Missing)
హైదరాబాద్‌కు చెందిన నితీష చివరగా గత నెల 30న లాస్‌ఏంజిల్స్ కనిపించారని పోలీసు చీఫ్ జాన్ గుట్టెరెజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మిస్సింగ్ పర్సన్ అలెర్ట్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, సాన్ బెర్నార్నిడో పోలీసుతో పాటు దాని భాగస్వామి ఎల్‌ఏపీడీలు నితీషా కందుల సమాచారం తెలిస్తే తమకు అందించాలని కాంటాక్ట్ నం (909)537-5165 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎక్స్‌లో కోరారు.ఇక నితీష విషయానికి వస్తే ఆమె ఎత్తు 5.6 అడుగుల ఎత్తు. 72.5 కిలోల బరువు, నల్లటి తలవెంట్రుకలు, నల్లటి కళ్లు అని పోలీసులు వివరించారు. కాగా ఆమె 2021 మోడల్ టయోటా కరోలా కాలిఫోర్నియా నెంబరు ప్లేట్ కారు నడపుతున్నారని చెప్పారు. ఆమెను ఎవరైనా చూస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఆమె ఏ సందర్బంలో కనిపించకుండా పోయారో స్పష్టంగా తెలియకుండా ఉంది.
ఇలాంటి కేసు గత నెలలో జరిగింది ఇండియన్ స్టూడెంట్ రూపేశ్ చింతకంది షికాగో లో మిస్సింగ్ అయ్యారు. అంతకు ముందు ఏప్రిల్‌లో 25 ఏళ్ల హమ్మద్ అబ్దుల్ అరాఫత్ ఇతను హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి. క్లీవ్‌ల్యాండ్‌లో మిస్ అయిన అరాఫత్ తర్వాత శవమై తేలాడు. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్‌లో ఎఫ్‌బీఐ 29 ఏళ్ల మయూషీ భగత్ న్యూజెర్సీలో ఏప్రిల్29, 2019 నుంచి కనిపించకుండా పోయారు. ప్రస్తుతం పోలీసులు భగత్ ఆచూకీ తెలిపిన వారికి రూ.10,000 డాలర్ల రివార్డు ప్రకటించారు. విద్యార్థుల ఆచూకీ తెలియకుండా పోవడంతో ఇండియాలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.