Former Governor Vidyasagar Rao: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. 1956లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని విద్యాసాగర్ రావు తెలిపారు. హైదరాబాద్ దేశానికి తలమానికమన్నారు.
దేశ భద్రతకి చాలా అవసరమన్న అంబేద్కర్..(Former Governor Vidyasagar Rao)
ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కానీ వాస్తవం అవుతుందని విద్యా సాగర్ రావు అన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
1956లో అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేసారు. బొల్లారం, సికిందరాబాద్, హైదరాబాద్ కలిపి రాజధానిగా పెట్టాలన్నారని అన్నారు.
దేశ భద్రతకి ఇది చాలా అవసరం అని అంబేద్కర్ అన్నారని ఆయన తెలిపారు.
రీంనగర్ జిల్లా కల్లోలిత జిల్లా కాదని తాను ఆనాడే చెప్పానని ప్రస్తుతం కళకళలాడుతున్న జిల్లాను చూసి ఆనందమేస్తుందన్నారు.తాను ఎంపీగా గెలిచి 25 ఏళ్లు పూర్తయిందన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేసాయని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో నేను క్రియాశీలంగా లేనని, బీజేపీలో సభ్యున్ని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిజెపిలో ఏదో జరిగిందనడం సరికాదని, తెలంగాణ బీజేపీ గురించి పార్టీ నేతలు, అధ్యక్షుడు చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు
17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలన్న తన డిమాండ్ నిజమైందని చెప్పారు మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుందని మోదీ పాలనలో మన దేశానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని నేతలంతా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మోదీ సలహా తీసుకుంటున్నారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.