Mujra Party: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు నలుగురు యువతుల అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు యువతులను ఢిల్లీ నుంచి పిలిపించారు. ఫామ్‌హౌస్‌లో యువతీయువకుల అసభ్యకర నృత్యాలు చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.
శివారులోని ఫాంహౌస్‌లలో..(Mujra Party)
ఈ ఘటనతో పాటు హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లలో ముఖ్యంగా వారాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది. తరచూ సామాజిక సమావేశాల ముసుగులో జరుగుతున్న ఈ ఘటనల్లో నిబంధనలకు విరుద్ధంగా యువతకు మత్తు పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. నిర్వాహకులు వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యంగా, అర్ధనగ్నంగా నృత్యాలు చేయిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో వ్యభిచారం కూడా చేస్తున్నారని సమాచారం.