Site icon Prime9

Sangaipet Thanda: సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్

Sangaipet Thanda

Sangaipet Thanda

Sangaipet Thanda: మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వంద శాతం పోలింగ్ నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తండా వాసులను అభినందించారు.అదేవిధంగా తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగిశాయన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. సాయంత్రం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా వచ్చారు.

తెలంగాణలో భారీగా పోలింగ్..(Sangaipet Thanda)

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యధికంగా మెదక్‌లో 71.33 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కేంద్ర ఆధ్వర్యంలో ఉండే యాప్‌లలో 415 ఫిర్యాదులు రాగా.. వేర్వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 225 ఫిర్యాదులు సీ విజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు. భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచినట్లు సీఈవోవికాస్ రాజ్ చెప్పారు.

 

Exit mobile version