Home Minister Mahmood Ali: మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. తన గన్‌మన్‌పై చేయి చేసుకున్నారు. శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకి బొకే ఇవ్వాలనుకున్నారు.
బొకే గురించి అడిగి.. (Home Minister Mahmood Ali)
కానీ ఆ సమయంలో బొకే అందుబాటులో లేకపోవడంతో వెంటనే తేవాలని గన్‌మన్‌ని ఆదేశించారు. సరిగ్గా వినిపించకపోవడంతో ఏంటి అన్నట్లు గన్‌మన్ అడిగారు. దీంతో గన్‌మన్ చెంపపై హోంమంత్రి కొట్టారు. బొకే తెమ్మని మళ్ళీ చెప్పారు. ఈలోగా వేరే గన్‌మన్ బొకే తేవడంతో వివాదం సద్దుమణిగింది. నొచ్చుకున్న గన్‌మన్‌కి మంత్రి శ్రీనివాస యాదవ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అమీర్‌పేట డివిజన్ డీకే రోడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ పాల్గొన్నారు.