Site icon Prime9

Home Guard Ravinder: ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్ మృతి

Home guard Ravinder

Home guard Ravinder

Home Guard Ravinder: మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గోషామహల్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్ మృతి చెందాడు.  డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడు. మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రవీందర్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

జాబ్ రెగ్యులరైజ్​ కావకపోవడం, జీతాలు సక్రమంగా అందకపోవడంతో రవీందర్ అనే హోంగార్డ్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోషామహల్​లోని కమాండెంట్ ఆఫీస్​లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్నవారు రవీందర్​ను ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే శరీరం 55శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పాతబస్తీ రక్షాపురానికి చెందిన రవీందర్ 15 ఏండ్లుగా హోంగార్డ్​గా పని చేస్తున్నాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఛత్రినాక లో ఉంటున్నాడు.

కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలి..( Home Guard Ravinder )

హోంగార్డు రవీందర్ మృతిపై బండి సంజయ్ కుమార్ స్పందించారు. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరం అన్నారు. రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని అన్నారు. రవీందర్ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యలను బయటపెట్టాలని..రవీందర్‎ను వేధించిన పోలీసులను..తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హోంగార్డ్ రవీందర్ మృతి నేపధ్యంలో తెలంగాణలోని హోంగార్డులకు పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డ్యూటీలో అందరూ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. డ్యూటీలో లేని హోంగార్డులు పోలీస్ స్టేషన్లో ఉండాలన్నారు. హోంగార్డులందరూ అందుబాటులో ఉండేలా.. ఇన్స్‎స్పెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version