Site icon Prime9

Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద హై టెన్షన్..

Nagarjuna Sagar project

Nagarjuna Sagar project

 Nagarjuna Sagar Project:నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ రైట్ కెనాల్ కు నీటిని విడుదల చేయడం కోసం ఏపీ పోలీసులు రావడంతో వివాదం చెలరేగింది. దాంతో ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ సరాఫరాను అధికారులు నిలిపివేశారు. ఇక ఏపీ పోలీసులు డ్యామ్ గేట్లు ధ్వంసం చేసి ఎస్పీఎఫ్ పోలీసులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ప్రాజెక్టుపై ఉన్న 13వ గేటు దగ్గర ముళ్లకంచె వేశారు. విషయం తెలుసుకొని టీఎస్ పోలీసులు అడ్డుకోవడంతో ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మెయింటినెన్స్ చేయడంతో ఏపీకి నీటిని విడుదల చేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు డ్యాం వద్దకు రావడంతో ఉత్కంఠ నెలకొంది.

కేసీఆర్ డ్రామా..( Nagarjuna Sagar Project)

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకుని ఆనకట్ట నిర్వహణ నీటిపారుదల శాఖ చూసుకుంటుందని, ఆనకట్టపై ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించాలని ఏపీ పోలీసులకు సూచించారు. ఏపీ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ బృందంతో వెంకటగిరి అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ ఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, ఎన్నికల ప్రయోజనాల కోసం తెలంగాణ సెంటిమెంట్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ఈ వ్యూహాలు పన్నుతున్నారని వెంకట రెడ్డి పేర్కొన్నారు.పోలింగ్ రోజు రాజకీయ మైలేజ్ కోసమే కేసీఆర్ నాగార్జున సాగర్ డ్యాం వద్ద అవాంతరాలు సృష్టించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత తొమ్మిది రోజులుగా ఈ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవారని అర్దం చేసుకుంటారని ఆయన అన్నారు.

Exit mobile version