Site icon Prime9

Bandi Sanjay :బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Bandi sanjay

Bandi sanjay

Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్ర నిరాకరణపై హైకోర్టులో బండి సంజయ్‌ పిటిషన్‌ వేయగా.. దానికి కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే రేపటి నుంచి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలుస్తోందిజ ఈ రోజు సభకు సమయం సరిపొకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కోర్టు ఆదేశాల మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది.

యాత్ర భైంసా పట్టణం నుంచి వెళ్లకూడదని, అవసరమైతే భైంసాకు మూడు కిలో మీటర్ల దూరంలో సభ జరుపుకోవచ్చని హైకోర్టు సూచించింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని సూచించింది. శాంతి భద్రతలను పూర్తిగా పోలీసులే కాపాడాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ జరుపుకోమని బండి సంజయ్‌కు సూచించిన హైకోర్టు… మరికొన్ని షరతులు విధించింది. ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని సూచించింది.

ఇతర మతస్తులను కించపరిచేలా వ్యాఖ్యలు వద్దని ఆదేశించింది. సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలని తెలిపింది. సభకు మూడు వేల మంది కంటే ఎక్కువ మందిని అనుమతించి వద్దని కూడా వారించింది. కార్యకర్తల చేతిలో ఆయుధాలు, కర్రలను తీసుకెళ్లొద్దని కూడా తెలిపింది. పాదయాత్ర కూడా ఐదువందల మందితో చేయాలని హైకోర్టు చెప్పింది.

Exit mobile version