Site icon Prime9

Prime 9 News CEO P.Venkateswara Rao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పి. వెంకటేశ్వరరావును సత్కరించిన హీరో సుమన్

Prime 9 News CEO

Prime 9 News CEO

Prime 9 News CEO P.Venkateswara Rao:  దేశానికి సైనికులు ఎలాగో సమాజానికి డాక్టర్లు అలా సేవచేస్తున్నారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని లయన్స క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అభయ బంజారా 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారని అన్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా పేషెంట్ల దగ్గరకు వెళ్లడానికి సంకోచించే సమయంలో వారు వారిని ఎంతో శ్రద్దగా చూసుకున్నారని అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యలు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎంతగానో సేవలందిస్తున్నరని అన్నారు. లయన్ శ్రీనివాసులు తనకు మంచి అభిమాని అని తనను ప్రతీ కార్యక్రమానికి పిలుస్తారని అన్నారు. లయన్స్ క్లబ్  చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని సుమన్ చెప్పారు. అనంతరం ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావును హీరో సుమన్ సత్కరించారు. అదేవిధంగా పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులను కూడా ఆయన సత్కరించారు.

 

Exit mobile version