Balakrishna: నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
గత చిత్రం అఖండ విజయంతో ఊపు మీదున్న బాలయ్య.. వీర సింహారెడ్డితో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా బాలయ్య వాఖ్యలు ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దేవ బ్రాహ్మణులకు వర్తించేలా బాలయ్య ఓ కామెంట్ చేశారు. దేవ బ్రాహ్మణుల గురువు దేవల మహర్షి అని.. వారి నాయకుడు రావణడు అంటూ బాలకృష్ణ సభలో వ్యాఖ్యనించారు.
దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏంటి
ఈ వ్యాఖ్యలపై స్పందించిన దేవ బ్రహ్మణులు.. బాలయ్యకు చరిత్ర తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన చెందారు.
ఈ వివాదం బాలకృష్ణ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు.
దీనిపై బాలకృష్ణ వివరణ ఇస్తూ.. ఎవరిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
ఇతరుల మనోభావాలను నొప్పించే తత్వం తనది కాదని ఈ సందర్భంగా బాలకృష్ణ(Balakrishna) అన్నారు.
ఈ వ్యాఖ్యలు పొరపాటున వచ్చాయని సంజాయిషీ ఇచ్చారు.
తనకు తెలియని సమాచారాన్ని తెలపినందుకు బ్రాహ్మణ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపినట్లు బాలకృష్ణ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఇక చిత్ర విజయోత్సవంపై మాట్లాడిన బాలకృష్ణ.. తన మనసులో మాట చెప్పారు. ఈ సినిమాలో తనకు చెల్లెలుగా నటించిన వరలక్ష్మిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.
వరలక్ష్మి హీరోయిన్ గా తనతో నటించాలని బాలయ్య కోరారు.
ఈ మూవీ విజయంలో వరలక్ష్మి పాత్ర చాలా గొప్పదని.. తను ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలని బాలకృష్ణ కోరారు.
ఈ సందర్భంగా సరదాగా డైరెక్టర్ గోపిచంద్ పై బాలయ్య సీరియస్ అయ్యారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కి చెల్లెలు పాత్ర ఇచ్చినందుకు కాస్త బాధగా ఉందన్నారు.
తర్వాతి చిత్రాల్లో మంచి పాత్రలు ఇవ్వాలని బాలకృష్ణ సూచించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/