Site icon Prime9

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు

Heavy Rains

Heavy Rains

 Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ వివరించింది. ఆదిలాబాద్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

జీహెచ్ఎంసీ లో ఎమర్జన్సీ టీములు..( Heavy Rains)

ఇక ఏపీలో నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పట్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో వరదలను నివారించడానికి మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ టీములు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల బారిన పడకుండా , ట్రాఫిక్ సమస్యలను తగ్గించేలా చూడటం,వరదనీటిని తొలగించడానికి అవసరమైన విధంగా సహాయక చర్యలను అమలు చేయడం చేస్తాయి. హైదరాబాద్‌లో 534 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లు, జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల్లో 157 మొబైల్‌ టీమ్‌లు, 242 స్టాటిక్‌ టీమ్‌లు, రోడ్లపై 29 టీమ్‌లు, 30 డీఆర్‌ఎఫ్ టీమ్‌లు, 13 పోలీస్ డిపార్ట్‌మెంట్ టీమ్‌లు, 41 ఎలక్ట్రిసిటీ విభాగాలు కలిపి మొత్తం 534 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

Exit mobile version