MLC Candidates in AP: అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పి.హరిప్రసాద్, సి. రామచంద్రయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్. మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు. దీంతో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. రామచంద్రయ్య పై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో టీడీపీ నేత రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి అవకాశం కల్పించింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో వారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన పార్టీ అభ్యర్థి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు.. పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు వచ్చానన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటానని, పవన్ కళ్యాణ్ సూచనకు అంగీకరించిన చంద్రబాబు, లోకేశ్ కు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయుడిగా అనేక సమస్యలమీద పరోక్షంగా పోరాటం చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు హరిప్రసాద్ . మండలిలో జనసేన తరఫున మొదటిసారి అడుగుపెడుతున్నానని, ఎమ్మెల్సీ గా తనకు అవకాశ రావడం సంతోషంగా ఉందన్నారు. మండలిలో అర్థవంతమైన చర్చలు సాగేలా నా వంతు ప్రయత్నిస్తానని హరిప్రసాద్ అన్నారు.
టీడీపీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసిన రామచంద్రయ్య మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా ఎంపికచేసినందుకు చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపారు.గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చానని అన్నారు.చంద్రబాబు నాయుడు కార్యకర్తల సాదక బాధలు తెలుసిన వ్యక్తి అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం గా వుందని దాన్ని ట్రాక్ పై పెట్టగల వ్యక్తి చంద్రబాబు అని నమ్ముతున్నట్లు తెలిపారు.ఈ మూడు సంవత్సరాలు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని పేర్కొన్నారు. తన రాజీనామా విషయంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. తనపట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని తెలిపారు.