Site icon Prime9

Guttha Amith Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్‌ రెడ్డి

Guttha Amith Reddy

Guttha Amith Reddy

Guttha Amith Reddy: తెలంగాణాలో బీఆర్ఎస్ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అమిత్‌రెడ్డి కలిశారు.లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ వీడుతున్న నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటున్నారు.

ఓటమి భయంతోనే ..టికెట్ వద్దన్న అమిత్(Guttha Amith Reddy)

గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఎప్పటి నుంచో నలుగుతున్న విషయమే . ఏప్రిల్ 28 న దీనికి క్లారిటీ వచ్చింది. బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న గుత్తా ఫ్యామిలీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. కనీసం లోక్‌సభ ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నేరుగా అధినాయకత్వానికి చెప్పేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

Exit mobile version