Site icon Prime9

Guntur Woman Suicide: లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మహిళ బలి

Guntur: లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మరోకరు బలయ్యారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు తీసుకుంది. అయితే లోన్ తీసుకున్న తరువాత ప్రతీ నెల చెల్లింపులు చేసిన ప్రత్యూష. మరో 8వేలు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గత కొన్ని రోజులుగా చెల్లింపులు చేయలేదు.

ఇదే సమయంలో లోన్ యాప్ ల నుంచి ఒత్తిడి పెరిగింది. డబ్బులు చెల్లించకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా ప్రతీ రోజు వేధింపులకు దిగారు. బాధితురాలి కాంటాక్ట్ నెంబర్లకి అసభ్య సందేశాలు పంపారు. దీంతో విసిగిపోయిన ప్రత్యూష సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త రాజశేఖర్ ఫిర్యాదుతో మంగళగిరిపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version