Gudem Kotha Veedhi: మన్యం జిల్లా , హితుగూడెం దగ్గర అడవిదున్నమాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ని పోలీస్ లు పట్టుకున్నారు . ఒరిస్సా లోని మల్కనగిరి ప్రాంతానికి చెందిన 13మంది వ్యక్తులు 7ద్విచక్ర వాహనాలు పై13 గోనె మూటలుతో ‘అడవి దున్న ఎండిన మాంసాన్ని తరలిస్తుండగా జీకే వీధి పోలీసు పట్టుకున్నారు.
.అడవిదున్న వన్య మృగం జాబితాలో వుంది దింతో దాన్ని చంపడం నేరం . ఈ మేరకు పోలీస్ లకు ముందస్తు సమాచారం అందింది . దింతో పోలీసులు జీకే వీధి రహదారి వద్ద వారిని అడ్డగించి పట్టుకున్నారు . వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియపరచి నిందితులను వాళ్లకు అప్పగించారు . వలలను ఆర్ వి నగర్ డివిజనల్ అటవీ అధికారి కార్యాలయానికి పారెస్టు అధికారులు తరలించారు . పదమూడు మంది నిందుతులని అటవీ శాఖ అధికారులు విచారించారు . వాళ్లంతా వారం రోజుల క్రితం జీకే వీధి పరిధిలోని ఎర్రగడ్డ ఏరియా వచ్చినట్లు తెలిపారు . ఆ ప్రాంతంలోని ఒక కొండ దగ్గర పాక లో ఉన్నట్లు చెప్పారు . పక్కనే ఉన్న గ్రామస్థులు ‘అడవి దున్న మాంసం పట్టుకొచ్చి తమకి ఇచ్చినట్లు తెలిపారు . ఆ మాంసాన్ని పట్టికెళ్తున్నట్లు వివరించారు . ఈ సందర్భంగా అర్వినగర్ అదనపు డి ఎఫ్ ఓ శ్రీనివాసరరావు మాట్లాడుతూ 7ద్విచక్రవాహనాలను సీజ్ చేసి,13మంది నిందుతులను రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు.