Lal Darwaja Bonalu: హైదరాబాదులో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా దగ్గర సింహవాహిని బోనాల పండగ సందర్భంగా.. ఆలయ కమిటీ తొలి బోనం సమర్పించింది. ప్రభుత్వం తరఫును మంత్రి తలసాని శ్రీనివివాస్ యాదవ్.. అమ్మవారికి అదికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు.
రెండు రోజులపాటు జరిగే బోనాల జాతరలో నేడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. మరోవైపు ఆలయ కమిటీలతో ముందుగానే సమావేశం నిర్వహించి తొట్టెలు, ఫలహారపు బండ్ల ఊరేగింపుల గురించి చర్చించారు. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం మరియు ఇతర ఆలయాలు ఈ వేడుక కోసం అలంకరించబడ్డాయి.రాజకీయ నాయకులు, సినీ నటులు మరియు బ్యూరోక్రాట్‌లతో సహా పలువురు వీఐపీలు ఆదివారం పాతబస్తీలోని దేవాలయాలను సందర్శించి నైవేద్యాలు సమర్పించనున్నారు.