AP Pensioners: ఏపీలో పింఛన్ల ఇంటింటి పంపిణీకి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని తాజాగా ఈసీ ఆదేశించడం జరిగింది . ఫస్ట్ తారీకు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పింఛన్ దారులలో టెన్షన్ మొదలవుతుంది .ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో గత నెలలో ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణి చేయడం కుదరలేదు .సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చింది .
ఇబ్బందులు లేకుండా..( AP Pensioners)
దీనితో బాగా వయస్సు మీరిన వృద్దులకు ఇబ్బందులు ఎదురయ్యాయి .ఈ క్రమంలో కొంత మంది వృద్దులు మరణించినట్లు అప్పట్లో టీడీపీ ఆరోపించింది . ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి ౩౦ నే జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృక్పధంతో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి సూచించింది .. పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా ఈసీ పేర్కొంది. . ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు, ఉద్యోగుల ద్వారా స్వయంగా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి సూచించింది.దీనితో పింఛన్ దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది .