Site icon Prime9

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro Rail: ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (L&TMRHL) ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీలో ఎక్సలెన్స్ రవాణా (రైల్వే) విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును పొందింది.ఇటీవల బెంగళూరులో ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్‌పై జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ కెవిబి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

శక్తివంతమైన ప్రేరణ..(Hyderabad Metro Rail)

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ యు. లలిత్ మరియు కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయ న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తి ఈ అవార్డును అందజేసారు. ఈ సందరబ్ంగా ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి కేవీబీ రెడ్డి మాట్లాడుతూఈ అవార్డు మా ఉద్యోగుల భద్రత మరియు శ్రేయస్సు పట్ల మా అచంచలమైన నిబద్ధతకు నిజమైన ప్రతిబింబం అని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు మాకు శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుందని అన్నారు.

 

Exit mobile version
Skip to toolbar