Ghmc Employee: జీహెచ్‌ఎంసీ లో మహిళా కార్మికులపై అకృత్యాలకు పాల్పడిన గాజులరామారం సర్కిల్ లోని శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ కిషన్ ను డిస్మిస్ చేసారు . అతను చేసిన కీచకపర్వం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తీవ్రంగా పరిగణించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసారు . మహిళా పారిశుద్ధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ ఆ సన్నివేశాలను తన సెల్‌ఫోన్‌లోనే చిత్రీకరించేవాడు . తర్వాత వాటిని సంబంధిత మహిళా కార్మికులకు చూపించి వారిని లొంగదీసుకునేవాడు . అయితే దాదాపు మూడు నెలల కిందట కిషన్ బాగోతం అధికారులకు తెలియడంతో.. అతన్ని మందలించిన అధికారులు మరో సారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించి సూరారం ప్రాంతానికి బదిలీ చేశారు. మహిళా కార్మికులు తనతో సఖ్యతగా ఉంటూ.. పనులు చేయకున్నా హాజరువేయడం, తనకు లొంగక పోతే డ్యూటీ కి వచ్చినా గైర్హాజరు చూపుతూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే తన పలుకుబడితో ఉద్యోగాల నుంచి తీసేయిస్తానని భయపెడుతూ తన అకృత్యాలను కొనసాగించాడు .
మూడు నెలల కిందట బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్తూ ఎస్‌ఎఫ్‌ఏ కిషన్ తన అధికారిక సెల్‌ఫోన్‌ను ఓ కార్మికుడికి ఇచ్చి వెళ్లాడు. దీంతో ఆ సెల్ ఫోన్ లోని ఫొటోలు లు చూస్తున్నఆ కార్మికుడికి ఈ వీడియోలు కంటపడ్డాయి . మహిళా కార్మికులతో కిషన్ చేసిన చేష్టలకు సంబంధించిన 69 వీడియోలు అందులో ఉన్నాయి. ఆ కార్మికుడు ఆ వీడియోలను ఇతర సిబ్బందికి, ఉన్నతాధికారులకు పంపాడు. ఈక్రమంలో కిషన్ మరోసారి ఇలాంటి తప్పులు చేయనని అధికారులను వేడుకోగా వారు వదిలేశారు. తాజాగా ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వారం కిందట ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పించారు. కిషన్‌తో పాటు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు సీహెచ్ ప్రణయ్‌ను గురువారం సర్వీసు నుంచి డిస్మిస్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.