Prime9

Munugodu by poll: ప్రత్యక్ష ఎన్నికల బరిలో తొలిసారిగా గద్దర్

Gaddar: ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గద్దర్ బరిలో దిగనున్నారు.ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు.

రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గద్దర్ మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న పాల్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రేపటి నుండి ప్రచారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

నవంబర్ 3న ఎన్నికల జరగనుండగా, 6న ఏ పార్టీ అభ్యర్ధికి విజయం దక్కిందో తేలనుంది.

ఇది కూడా చదవండి: Munugode: మునుగోడులో ఏకంగా పొటేళ్లు, మేకలను బహుమతిగా ఇస్తున్న రాజకీయ పార్టీలు

Exit mobile version
Skip to toolbar