Site icon Prime9

TSRTC: తెలంగాణ మహిళలకు రేపటినుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

TSRTC

TSRTC

TSRTC: మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫ్రీ బస్సు జర్నీ స్కీం విధివిధానాలు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి తెలంగాణ మహిళలు, ఆడపిల్లలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం చేయనున్నారు. జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, సిటీలో ఆార్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఐడీ ప్రూఫ్ గా ఆధార్ కార్డు..(TSRTC)

వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయెచ్చని ప్రభుత్వం తెలిపింది. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్స్‌కు అవకాశం కల్పించారు. ఇతర రాష్ట్రాల బార్డర్స్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.టీఎస్ఆర్టీసీ సాఫ్ట్‌వేర్ ఆధారిత లక్ష్మి స్మార్ట్ కార్డ్‌ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పిన దాని మేరకు మహిళలు తెలంగాణ వాసులుగా రుజువు కోసం తమ ఆధార్ కార్డులను బస్సు కండక్టర్‌కు చూపించాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వాగ్దానానికి సంబంధించి సంస్ద పై పడే నష్టాలను అధికారులు శుక్రవారం ప్రత్యేక ప్రజెంటేషన్‌లో ప్రస్తావించారు. టీఎస్సార్టీసీ సగటు రోజువారీ ఆదాయం రూ.14 కోట్లుకాగా ప్రస్తుతం సంస్ద రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉంది.

మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు జర్నీ కి జీవో జారీ | Good News To Telangana Women | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar