Site icon Prime9

CM Jagan on Muslim Reservations: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కొనసాగుతుంది.. సీఎం జగన్

cm jagan (karnool)

cm jagan (karnool)

CM Jagan on Muslim Reservations:ముస్లిం రిజర్వేషన్లపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారని విమర్శించారు. ఆరు నూరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు .

చంద్రబాబుది  ఊసరవెల్లి రాజకీయం..(CM Jagan on Muslim Reservations)

కర్నూలు ఎన్నికల ప్రచారసభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ఒక వైపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకు దొంగ ప్రేమ నటిస్తారు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా.. అంటూ ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై మంది పడ్డారు .తాజాగా జగన్ కర్నూలు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు .చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరు నూరైన.. నూరు ఆరైన ముస్లిం లకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్‌ మాట. ఇది వైఎస్సార్‌ బిడ్డ మాట’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలడా అంటూ ప్రశ్నించారు . అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు’’ అని సీఎం జగన్‌ ఈ సందర్భంగా చంద్రబాబు ను నిలదీశారు.

కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు మీ బిడ్డ అని అన్నారు . కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది కుళ్ళు రాజకీయం అని అన్నారు . నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పటాన్‌, సయ్యద్‌, మొగల్స్‌ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే ఇచ్చింది ఈ రిజర్వేషన్లు.మా ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం, ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

చంద్రబాబు పై జగన్ షాకింగ్ కామెంట్స్ | CM Jagan Shocking Comments On Chandrababu

Exit mobile version
Skip to toolbar