Four killed, 20 injured Bus Hits Cement Lorry in Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చోదిమెళ్లలో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
ఈ బస్సు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రమాదంపై ఎంపీ అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. చాలా మందికి గాయాలయ్యాయి. ఇందులో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నివేదికలో వెల్లడిం్చారు. ఈ బస్సు వెంకటరమన ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో రహదారి వెంట భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్రేన్ సహాయంలో రోడ్డుపై అడ్డంగా పడిన బస్సును తొలగించారు.