Lakshmibai: కేంద్ర మాజీ మంత్రి శివ శంకర్ భార్య లక్ష్మీబాయి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీ బాయి (94) గురువారం ఉదయం కన్ను మూశారు. శివశంకర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు 1979 ఉప ఎన్నికల్లో ,1980 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు .

  • Written By:
  • Publish Date - May 31, 2024 / 01:05 PM IST

Lakshmibai:  కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీ బాయి (94) గురువారం ఉదయం కన్ను మూశారు. శివశంకర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు 1979 ఉప ఎన్నికల్లో ,1980 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు . తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు . రాజీవ్ గాంధీ కేబినెట్ లో మానవవనరులు ,విదేశీవ్యవహారాలు శాఖ మంత్రిగా పనిచేసారు . కొంత కాలం సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసారు . 1998 లో శివశంకర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు .2017 లో శివశంకర్ మరణించారు .

80 ఏళ్ల తర్వాత ఆమె రెండు పిహెచ్ డీ లు..(Lakshmibai)

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయిన లక్ష్మీబాయి ని వివాహం చేసుకున్నారు పి శివశంకర్ .లక్ష్మీబాయి విశాఖ జిల్లా యలమంచిలిలో జన్మించారు. ఆమె భువనేశ్వర్ లోని ఉత్కల్ యూనివర్సిటీలో బీఏ చేసి, ఒడిశాలోనే మొదటి మహిళా పట్టభద్రురాలిగా పేరుగాంచారు. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చదివారు. 80 ఏళ్ల తర్వాత ఆమె రెండు పిహెచ్ డీ లు పూర్తిచేయడం విశేషం. ఉస్మానియా వర్సిటీ నుంచి ‘భగవద్గీత-ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం’ అనే అంశంపై పిహెచ్ డీ చేసారు . దశాబ్దాల క్రితమే ఉన్నత విద్యావంతురాలిగా గుర్తింపు పొందారు లక్ష్మీబాయి.లక్ష్మీబాయి శివశంకర్ దంపతులకు సుధీర్ కుమార్ ,వినయ్ కుమార్ కుమారులు గలరు .సుధీర్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ,మలక పేట ఎమ్మెల్యేగా పనిచేసారు .సుధీర్ కుమార్ 2002 లో మరణించారు .మరో కుమారుడు వినయ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు .వినయ్ కుమార్ సతీమణి అలేఖ్య పుంజాల కూచిపూడి నృత్యంలో గొప్ప పేరున్న కళాకారిణి .తెలుగు విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గా పదవి విరమణ చేసారు .