Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన్ను ఇవాళ ఉదయమే జైలుకు తరలించారు. నంబూరి శేషగిరి రావుపై దాడి, సిఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. నిన్న మాచర్లలో మేజిస్ట్రేట్ వద్ద ఇరు వర్గాల వాగ్వాదం జరగడంతో.. సెంట్రల్ జైల్ వద్ద భద్రత పెంచారు.
14 రోజుల రిమాండ్..(Pinnelli Ramakrishna Reddy)
కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం పిన్నెల్లిని అధికారులు.. నెల్లూరు జైలుకు పిన్నెల్లి తరలించారు. మొత్తం నాలుగు కేసులకు గానూ.. రెండు కేసుల్లో బెయిల్ రాగా.. మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం కేసు, మహిళపై దాడి కేసులో బెయిల్ రాగా.. నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం.. కారంపూడిలో సీఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది.