Site icon Prime9

Yerneni Sita Devi: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

Yerneni Sita Devi

Yerneni Sita Devi

Yerneni Sita Devi: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఎన్టీఆర్ కేబినెట్లో.. (Yerneni Sita Devi)

ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కొంత కాలం క్రితం ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్‌ (చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్‌ సోదరుడు యెర్నేని రాజారామచందర్‌ కూడా రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

Exit mobile version