Site icon Prime9

Daggubati Venkateswara Rao: ఎమ్మెల్యేగా ఓడిపోవడం మంచిదయింది.. మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

Daggubati

Daggubati

Daggubati Venkateswara Rao: ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడులో మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడం మంచిదయిందని అన్నారు. అంతేకాదు సీఎం జగన్ తన కొడుక్కి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసానని అన్నారు.

ఎమ్మెల్సీ ఆఫర్ రిజెక్ట్ చేసాను..(Daggubati Venkateswara Rao)

కారంచేడులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గ్రామస్తులతో మాట్లాడారు. కారంచేడులో రోడ్లు వేయలేదంటున్నారని, ఆ రోజు తనని పర్చూరు నియోజకవర్గంలో ఓడించకుండా గెలిపించి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడినా అని ప్రశ్నించారు. ఎన్నికలు అయిన రెండు నెలల తర్వాత జగన్ పిలిపించి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన నిబంధనల చట్రంలో మనం ఇమడలేమనుకుని.. రాజకీయాలు వద్దని సున్నితంగా తిరస్కరించామని దగ్గుబాటి వెంకటేశ్వర రావు వెల్లడించారు.

రాజకీయాలంటే నేడు బూతులు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంగా మారాయని వెంకటేశ్వరరావు అన్నారు. తన సతీమణి పురంధేశ్వరి బీజేపీ అధికారంలో లేనపుడే చేరారని అన్నారు. వెంకటేశ్వరరావు గత ఏడాది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.అయతే ప్రజాసేవకు మాత్రం దూరమవనని పేర్కొన్నారు. ఏది ఏమయినా వెంకటేశ్వరావు వ్యాఖ్యలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

 

Exit mobile version