Ambati Rayudu: భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్‌సిపిలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ క్రికెటర్ రాయుడికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాయుడు గత కొద్దకాలంగా ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పధకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
జగన్ పాలన బాగుంది..(Ambati Rayudu)
ఈ సందర్బంగా అంబటి రాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం తనకు సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ కుల,మత, రాజకీయాలకు అతీతంగా పాలన చేస్తున్నారని అందుకే ఆయనకు మద్దతు తెలిపాననన్నారు. సంక్షేమ పధకాలపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ, జనసేన నేతలు ఇపుడు తాము వాటికన్నా ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారని అన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఎత్తు పల్లాలతో సాగిన కెరీర్..
అంబటి రాయుడు 16 ఏళ్ల వయసులో 2002లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా అరంగేట్రం చేసారు. మరుసటి సంవత్సరమే భారత్ A జట్టులో స్థానం సంపాదించారు. అతను 2004 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే “రెబెల్” ఇండియన్ క్రికెట్ లీగ్‌లో అతని ప్రమేయంతో పాటు సహచర ఆటగాళ్ళు మరియు రాష్ట్ర సంఘాలతో వివాదాలతో జాతీయ జట్టుకు దూరమయ్యారు. 2009లో బీసీసీఐ యొక్క క్షమాభిక్ష ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వచ్చారు. ఐపీఎల్ లో బరోడా మరియు ముంబై ఇండియన్స్ తరపున ఆడి మంచి స్కోర్లు సాధించారు. రాయుడు 2012లో తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించారు. జూలై 2013లో జింబాబ్వేపై అంతర్జాతీయ అరంగేట్రం చేసారు. మే 28, 2023న ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.మే 29 న అన్ని రకాల భారత క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు.