Site icon Prime9

KCR injured: మాజీ సీఎం కేసీఆర్ కు గాయం..యశోద ఆసుపత్రిలో చికిత్స

KCR injured

KCR injured

KCR injured: మాజీ సీఎం కేసీఆర్‌ నిన్న రాత్రి ప్రమాదవ శాత్తూ కింద పడటంతో.. కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ను హుటా హుటిన హైదరాబాదులోని యశోదాఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఎముకకు గాయం కావడంతో సర్జరీ చేయాలని యశోదా వైద్యులు నిర్ణయించారు.

ఇప్పటికే యశోదా ఆస్పత్రి వైద్యులతో కేటీఆర్, కవిత, హరీష్ రావులు మాట్లాడారు.మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆస్పత్రిలో చేరారన్న సమాచారం అందడంతో సిఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ ఉదయం యశోద ఆస్పత్రిని సందర్శించారు. కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. కింద పడటం వల్ల కెసిఆర్ తుంటి ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. ఇది మినహా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆరా..(KCR injured)

మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌కి అత్యుత్తమ వైద్య సేవలందించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆస్పత్రి వైద్యులకి సూచించారు.యశోదా ఆస్పత్రి వద్ద సెక్యూరిటీ పెంచాలని అధికారులను ఆదేశించారు.ఎప్పటికప్పుడు కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు.కేసీఆర్ ఆరోగ్యంపై యశోదా ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సర్జరీ తర్వాత 8 వారాల్లో కేసీఆర్ కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఆరోగ్యం గురించి తెలిసి బాధకలిగిందని ప్రధాని ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

 

Exit mobile version