‘The World’ Luxury Ship:విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ ప్రయాణికుల నౌక విశాఖ చేరుకుంది. ఏప్రిల్ 28 న 80మంది ప్రయాణికులతో ‘ది వరల్డ్’ అనే క్రూయిజ్ షిప్ పోర్టు లోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు చేరుకుంది .’ ఈ నౌక లగ్జరీ విభాగానికి చెందిన ది. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్ నౌకలకు విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్ గమ్యస్థానంగా మార్చుతామనే తమ విధానానికి ఇది నిదర్శనమని పోర్టు అధికారులు – వెల్లడించారు. అద్భుతమైన ఆతిథ్యానికి మారుపే రైన ‘ది వరల్డ్’ షిప్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 80 మంది పర్యాటకులు విశాఖ చేరుకున్నారు. వీరందరికీ సంప్రదాయ పద్ధతిలో పోర్ట్ అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. షిప్లో వచ్చిన పర్యా టకులు విశాఖ చుట్టూ పక్కల ఉన్న ప్రసిద్ధి చెందిన సందర్శన ప్రదేశాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు ఉత్సాహం చూపించారు.
సాంప్రదాయ స్వాగతం..(‘The World’ Luxury Ship)
టెర్మినల్ కు చేరుకున్న ఇంటర్నేషనల్ క్రూయిజ్ కు సాదరంగా ఆహ్వానం పలికారు పోర్టు చైర్ పర్సన్ డా||ఎం. అంగముత్తు . పోర్ట్ లో ఈ క్రూయిజ్ టెర్మినల్ ను రూ.96 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన క్రూయిజ్ షిప్పుల రాకపోకలకు అను వుగా నిర్మించారు. అలాగే పర్యాటకులకు అవసర మైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు, వారికి సౌకర్యవంతమైన అనుభూతి కల్పించే ఏర్పాట్లు చేశారు. దేశంలోని ఇతర పోర్టులతో పోల్చుకుంటే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను విశాఖపట్నం పోర్టు 45 నిముషాల లోపే పూర్తి చేయడంపై షిప్ కెప్టెన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది . నగరంలోని ప్రముఖ బీచ్లు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు, స్థానికంగా ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఉన్నాయనీ.. క్రూయిజ్ రాక విశాఖ స్థానిక పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని చైర్మన్ డా|| అంగముత్తు తెలిపారు. ఏప్రిల్రా 29 రాత్రి ఇక్కడి నుంచి షిప్ పోర్టుబ్లెయిర్ కు బయల్దేరి వెళ్లనుంది