Site icon Prime9

Flexes against Chandrababu : తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

chandrababu

chandrababu

AndhraPradesh News: పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలోచంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిసాయి. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టిడిపి నాయకులు. టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే వ్యతిరేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసిపి నేతలు. నువ్వు వస్తే అరాచకం, నువ్వు వస్తే ప్రైవేటీకరణ, నువ్వోస్తే పథకాలు రద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు ప్రసంగించే ప్రదేశంలోనే ఫ్లెక్సీలు కట్టడంపై తాడేపల్లిగూడెంలో ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై ఫ్లెక్సీలు కట్టడమే అరాచకమని, కవ్వింపు చర్యలకు పాల్పడడమే..వైస్సార్సీపీ నాయకుల నైజం అని టీడీపీ నాయకులు విమర్శించారు. చంద్రబాబు సభకు భారీ సంఖ్యలో టిడిపి నాయకులు..కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.

మరోవైపు బీసీల పొట్టగొట్టి జగన్ తన పొట్ట పెంచుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను వెతుక్కుంటూ వచ్చి పదవులు ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో పేరుకే బీసీలకు కొన్ని పదవులని, పెత్తనమంతా అగ్ర కులాలకేనని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని ఆరోపించారు. టీటీడీలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా మూడు పదవులు మాత్రమే ఇచ్చారన్నారు.

Exit mobile version