Siddipet Accident: సిద్దిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్నవారు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం మునిపడ గ్రామంలోని మల్లన్న ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం వద్ద మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.
అక్కడికక్కడే నలుగురు మృతి
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలపగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీలుసు ప్రాథమికంగా అంచన వేశారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎక్కడి నుంచి వస్తున్నారంటే?
ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బాధితులు యదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వేములవాడ శ్రీరాజరాజశ్వేర స్వామి వెళ్లి వస్తుండగా మునిగడప వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గుంతలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.
గతంలోనే అధికారులు గుంతను పూడ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని
కోరుతున్నారు. అలాగే ఈ మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని.. మూల మలుపు ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామాస్తులు కోరుతున్నారు.
ఈ ఘటనపై అధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్
హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్
బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/