Site icon Prime9

surrogacy: జగిత్యాల జిల్లాలో ఆవులపై సరోగసీ ప్రయోగం

Jagityala: జగిత్యాల జిల్లాలో సరోగసీ విధానం ద్వారా దూడలకు జన్మనిస్తున్నాయి పాడిపశువులు. ఎల్డీఏ, కోరుట్ల పశువైద్యకళాశాల సంయుక్తంగా చేపట్టిన సరోగసి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కోడెకవల దూడలు జన్మించాయి. ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ విధానంలో తొలి సారిగా మూడు దూడలు జన్మించాయని డాక్టర్ అరుణ తెలిపారు.

సాహివాల్దేశీ జాతి గిత్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలోకి ప్రవేశ పెట్టడం ద్వారా మూడు దూడలు జన్మించినట్లు వెల్లడించారు. నాణ్యమైన అవును పొందాలంటే నాలుగైదు సంవత్సరాల కాలం పడుతుందని, అదే సరోగసీ విధానం ద్వారా ఒకే ఈతలో నాణ్యమైన బ్రీడ్ ను పొందవచ్చని రైతు రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

Exit mobile version