Site icon Prime9

Farmer Suicide: తన పొలాన్ని ధ్వంసం చేసారంటూ సెల్ఫీ వీడియోతో రైతు ఆత్మహత్య

Farmer suicide

Farmer suicide

Farmer Suicide: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తన పొలాన్ని కొందరు జేసీబీలు, బుల్డోజర్లతో దున్ని ధ్వంసం చేశారని అధికారులకు మొర పెట్టుకున్నా..పట్టించుకోక పోవడంతో.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని, ఎమ్మార్వోతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోక పోవడంతో.. గ్రివెన్స్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే అప్పటికే గ్రీవెన్స్ టైం అయిపోయిందని..అధికారులు రైతును వెనక్కి పంపారు.

సీఎం, డిప్యూటీ సీఎంలు న్యాయం చేయాలి..(Farmer Suicide)

దానితో తీవ్ర మనో వేదనకు గురైన రైతు ప్రభాకర్..సెల్ఫీ వీడియోలో సీఎం, డిప్యూటీ సీఎంలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. రైతు అనుకూల ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేశామని, అయితే బలవన్మరణానికి పాల్పడుతున్నానని అన్నారు.పురుగుమందు తాగిన తర్వాత, అతను తన కుటుంబానికి ఫోన్ చేసితన నిర్ణయం గురించి చెప్పాడు.కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా అతని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రభాకర్ శవమై కనిపించాడు.ఈ సంఘటనతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొద్దుటూరు గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

Exit mobile version