Site icon Prime9

Kanti Velugu: తెలంగాణ వ్యాప్తంగా 1.6 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు..

Kanti Velugu

Kanti Velugu

 Kanti Velugu: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జనవరి 18న ఖమ్మంలో ప్రారంభించిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.6 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు.

అంధత్వ రహిత తెలంగాణను చేయాలనే లక్త్యంతో  ప్రారంభించబడిన కంటి వెలుగు కార్యక్రమం 100 రోజుల పాటు అమలు చేయబడుతోంది, ఇప్పటివరకు 1, 58, 35, 947 మంది వ్యక్తులను పరీక్షించగా, వారిలో 22 లక్షల మంది (22, 21, 494) మందికి కళ్లద్దాలు పంపిణీ చేసారు. కంటివెలుగు కార్యక్రమం ఇదే వేగంతో కొనసాగితే జూన్ 15వ తేదీ నాటికి 2 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఐదేళ్లకిందట ప్రారంభం..( Kanti Velugu)

కంటి వెలుగు మొదటి దశ 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించి 8 నెలల పాటు కొనసాగింది. 1.50 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 12, 304 గ్రామ పంచాయతీలు, వార్డులు మరియు 3, 598 మునిసిపల్ వార్డులలో 89 పని దినాలలో 96.21 శాతం మంది అర్హులైన వ్యక్తులు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

కంటి పరీక్ష శిబిరాల్లో నమోదైన లెక్కల ప్రకారం చూపు మసకబారిన వారు, దగ్గరి వస్తువులు చూడలేని వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతేకాకుండా కంటి సమస్యలతో వస్తున్న పలువురికి విటమిన్ ఎ, డి, బి కాంప్లెక్స్ మాత్రలను కూడా పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా కంటి శుక్లాలతో బాధపడుతున్నారు.

Exit mobile version