Site icon Prime9

Bhuma Akhilapriya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు

Bhuma Akhilapriya

Bhuma Akhilapriya

Bhuma Akhilapriya: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కర్నూలు కోర్టు కొట్టేసింది. సాయంత్రం కర్నూలు జైలు నుంచి అఖిలప్రియ విడుదలకానున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు.

జైలులో 8 రోజులు..(Bhuma Akhilapriya)

ఏవి సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియాతో పాటు మరో 11 మంది పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను నంద్యాలలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అఖిలప్రియాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 17 నుంచి దాదాపు 8రోజుల పాటు భూమా అఖిల ప్రియా కర్నూలు మహిళ సబ్ జైలులొ ఉన్నారు. నిన్న కర్నూలు కోర్టులో అఖిల ప్రియా తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ వేసి.. తమ వాదనలను వినిపించారు. ఈ రోజు సాయంత్రం అఖిల ప్రియ బైయిల్ పై జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ నెల 17న కొత్తపల్లిలో అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి బృందాలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. అఖిలప్రియ దంపతులను పోలీసులు ఉదయం అరెస్టు చేసి పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అఖిల ప్రియ, ఆమె భర్తపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

https://youtu.be/4m5eas0LUnM

Exit mobile version