Site icon Prime9

Electricity consumption in AP: ఏపీలో ఆల్‌టైం రికార్డును తాకిన విద్యుత్‌ వినియోగం

Electricity consumption

Electricity consumption

Electricity consumption in AP: ఏపీలో ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఎక్కువ సమయాన్ని ఇళ్ళల్లోనే గడుపుతున్నారు .పైగా చల్లదనం కోసం ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు . దింతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ అధికారులు అంచనాకి వచ్చారు. గడిచిన మూడు రోజుల్లో కరెంట్‌ను ప్రజలు విపరీతంగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగం ఆల్‌టైం హై రికార్డును తాకింది.

ఈ సారి విద్యుత్ డిమాండ్ అధికం..(Electricity consumption in AP)

ఏపీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బుధవారం 253 మిలియన్ యూనిట్లు, గురువారం 259 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. శుక్రవారం కూడా రికార్డుస్ధాయిలో 260 మిలియన్ యానిట్ల దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ 219 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండడం గమనించదగ్గ విషయం . ఇక గత ఎనిమిదేళ్లలో మే నెలలో రికార్డు స్ధాయి విద్యుత్‌ వినియోగం కూడా ఇదే కావడం మరో విశేషం. ఎన్నడూ లేని విధంగా 13231 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కంటే 26 శాతం అధికంగా విద్యుత్ డిమాండ్ నెలకొనడం ఇంకో విశేషం.

కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా..

గడిచిన మూడు రోజులుగా ఏపీలో కరెంట్‌ డిమాండ్ పెరగడంతో , మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు డిమాండ్‌ పీక్‌లో ఉన్న టైంలోనూ కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కారణంగా యూనిట్‌ విద్యుత్‌ రూ.7లకే కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.15 కోట్లతో 22 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తోందని ఏపీ విద్యుత్ శాఖ తెలియచేసింది .

Exit mobile version